4 Mar 2016

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - ఉలికిపడకు ఉలికిపడకు song lyrics

Krishnagadi Veera Prema Gaadha - Ulikipadaku Ulikipadaku song lyrics

Music Composer      : Vishal Chandrasekhar
Lyric writer              : Krishnakanth
Singer                         : Rahul Nambiar, Sinduri Vishal

వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా
వచ్చివాలి చంపమాకు నన్నిలా
చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా
మచ్చుకైన విచ్చుకోదు నవ్విలా

అబ్బ ఇంత కోపమా
దగ్గరుంది దూరమా
తియ్యనైన కొరివి కారమా
పదును లేదు సులువు కాదు
మలుపులేని నలుపు దారిదే

అలాగ ఉలికి పడకు ఉలికి పడకు ఉలికి పడకలా...
ఊ అంటే వుడికిపోయి పడకలా
ఓ హొ హొ... ఎగిరి పడకు ఎగిరి పడకు ఎగిరి పడకలా...
తుఫాను హొరులోన గాలి పటములా...

బుల్లి విలనుతో పాటు
పిల్ల దెయ్యమే కాదు
బుజ్జి బూతం వుంది నువ్వు ముద్దు పెట్టకే
ప్రేమ చూపడం లేటు
లేని పోనిది డౌటు
చిన్ను బుజ్జికావు కాస్త హద్దు దాటితే

కొలవలేని గారమా
పొగుడుతుంటే నేరమా
లైఫు టైము తెగని బేరమా
పొగడమాకు వినను నీకు
లొంగనింక బేరమాడకు                    [ అలాగ ఉలికిపడకు... ]

పెళ్ళి తంతుకే మేము పెద్ద మనుషులం కామ?
పక్కనున్న లెక్కలేదు మేము హర్ట్ లే
బుజ్జి బుగ్గలే మావి ముద్దు పెట్టరా మీరు
బుంగ మూతి పెట్టుకోము మేము హర్ట్ లే

చిన్ని చిన్ని నవ్వులం
చిట్టి పొట్టి పిల్లలం
చుట్టుకుంటే విడిచిపోములే
బ్లాక్ రోడ్ రెడ్ కార్
పైగా మేము బంపర్ ఆఫర్                      [ అలాగ ఉలికిపడకు... ]

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - title song lyrics

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - Krishnagadi Veera Prema Gaadha title song lyrics

Music Composer      : Vishal Chandrasekhar
Lyric writer              : Krishnakanth
Singer                         : Ranjit

వినరా సొదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
క్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గా
తందన్న దంద ననె తందన్న దంద ననె
తందన్నా దందా నానె నా...
తందన్నా దందా నానె నా...
తందన్నా దన్నా
సింకేది బాబాయ్
అన్నయ్యా నీ  పిచ్చికి మా ఇన్స్ట్రుమెంట్స్ సరిపోవుగాని
మా స్టైలు లొ పాడెయ్

రంపం తర ర రరంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర రం

ఓరి బ్రహ్మ్మా దేవుడో ఎంత డేంజెర్ గాడివో
గిఫ్ట్ కిచ్చి ప్రేమనీ మరచినావా పెళ్ళినీ
సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడురా రామ రామ
అందుకేరా ఎంత ఉన్న ప్రేమా బయటికసలే చెప్పలేమ్మా
టాక్ నో నో టచ్ నో నో డ్రీం లోనూ  డ్యూయెట్ నో నో
ఓ గాడు బ్రహ్మా టూ బాడు జన్మ ఇచ్చావే ర్మా


రంపం తర ర రరంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర రం

రంపం తర ర రరంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర రం

ఓరి బ్రహ్మ్మా దేవుడో ఎంత డేంజెర్ గాడివో
ఈష్క్ తోటి పాటుగా రిస్క్ నే ఇచ్చావురో
లైఫు రోడ్డు ని తిప్పాడు మలుపు
తెరిచినాడు పెళ్ళి తలుపు
వెతికిచూసా మాలక్ష్మి కొరకు
కలవలేదు ఇంతవరకూ
ఫొనెత్తలేదు అడ్డ్రెస్స్ తెలీదు
పాప జాడే పతా లేదు
ఓ గాడు బ్రహ్మా టూ బాడు జన్మ ఇచ్చావే ర్మా

రంపం తర ర రరంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర రం
రంపం తర ర రరంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం
రంపం తర ర ర రంపరం పరం

రంపం తర ర రం

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ - నువ్వంటే నా నవ్వు song lyrics

Krishna Gadi Veera Prema Gaadha Song Lyrics

ఈ సినిమా లోని అన్ని పాటలలో కెల్లా నాకు ఎంతో ఇష్టమైన పాట నువ్వంటే నా నవ్వు. (Nuvvante Na Navvu)

Music Composer      : Vishal Chandrasekhar
Lyric writer              : Krishnakanth
Singer                         : Haricharan, Sinduri Vishal

నువ్వంటే నా నవ్వు 
నేనంటే నే నువ్వు 
నువ్వంటూ నేనంటూ లేమనీ 

అవునంటూ మాటివ్వు 
నిజమంటూ నే  నువ్వు 
నే రాని దూరాల్ని నువ్ పోనని 

ఎటు ఉన్నా నీ నడక 
వస్తాగా నీ  వెనక 
దగ్గరగా రానీను దూరమే 

నే వేసే ప్రతి అడుగు 
ఎక్కడికో నువ్ అడుగు 
నిలుచున్నా నీ వైపే చేరేనులే 


నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.   [ఈ చినుకు]

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వూ నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేనా  కలిసే వున్నా
మనమంటూ  పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా


నువ్  నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే 
నువ్ కలిసొచ్చే శాపానివే 
నీరల్లే మారేటి రూపానివే 
నచ్చే  దారుల్లో నడిచే నదులైనా 
కాదన్నా కలవాలి సంద్రములోన 
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే 
వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ 
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా