15 Oct 2013

కస్టమర్ care వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా???


ఈ మధ్య అసలు ఈ customer care అనే దానికి అర్ధం లేకుండా చేస్తున్నారు. ఫోన్ చేసి మరి అడ్డదిడ్డమైన offers గురించి, చెత్త పాటలు కాలర్ ట్యూన్ గా పెట్టుకోమని చెప్పి చంపేస్తున్నారు. నేను అందుకే అలాంటి బాధలేకుండా BSNL తీసుకున్నా. వీళ్ళు మనకు సమస్యలు వచ్చి కాల్ చేసినా పట్టించుకోరు, ఇక కాల్ చేసి ఆఫర్స్ గురించి చెప్పడం కూడానా? అందుకే ఏదైనా ప్రోబ్లెమ్ వస్తే మన జుట్టు మనమే పీక్కోవాలి కానీ BSNL customer care వాళ్ళకి ఫోన్ చేసి జుట్టు ఎలా పీక్కోవాలి అని అడక్కూడదు. మనల్ని wait చేయమని చెప్పి ఒక గంట సేపు తిరిగి, కాఫీ తాగి వస్తారు. ఒకసారి నేను అలా స్పీకర్ ఫోన్ లో పెట్టి వదిలేస్తే 15 నిమాషాల సేపు మ్యూజిక్ వస్తూనే ఉంది. అందుకే BSNL customer care కి నేను ఫోన్ చేయను, వాళ్ళూ నాకు ఫోన్ చేయరు.
కానీ నా broadband వేరే కంపెనీది అవడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి చావకొట్టేవాళ్లు. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుండగా customer care నుంచి ఫోన్ వచ్చింది. నేను ఉండేది రాజస్థాన్ లో కనుక వాడు హిందీలో చెప్తున్నాడు. వాడు చెప్పింది నాకు అర్ధం అయినా, వాడ్ని మొత్తం చెప్పనిచ్చి “Can you repeat the same thing in English” అన్నా. అంతే సరే అని ఫోన్ పెట్టేశాడు. తిక్క కుదిరింది వాడికి.

మీకేమైనా techniques తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి.  

24 Sept 2013

మీరు అరుంధతి నక్షత్రాన్ని చూసారా?

పెళ్ళైన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీరు అరుంధతి నక్షత్రాన్ని చూసారా? పెళ్లికానోళ్ళు కూడా తెలుసుకోండి. పెళ్లిళ్లలో పంతులు గారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురులకి అరుంధతి నక్షత్రాన్ని చూడామణి చెప్తారు, ఆయనకి ఎలాగూ కనపడదనుకోండి. కొత్త దంపతులేమో ఎక్కడా ఎక్కడా అని వెతికేసి (ఆకాశంలోనండి బాబూ!!!), మెడలు నొప్పి పుట్టి, కనపడింది అని అబద్దం చెప్పేస్తారు. చూసారా... పెళ్ళైన వెంటనే అబద్దాలు మొదలెట్టేస్తారు!!!! :-P.
అసలు ఆ అరుంధతి నక్షత్రం, దాని కధాకమానిషా ఇప్పుడు చెప్తా, మీరు బుద్ధిగా వినేయండి. అనగనగా ఏడుగురు ఋషులు ఉండేవారు. వాళ్ళు వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, అత్రి, అగస్య, వీళ్ళ పేరు మీద ఏడు నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి సప్తర్షి మండలం అంటారు. వీళ్ళందరిలో వశిష్టునికి ఒక ప్రత్యేకత ఉంది. అది వాళ్ళ ఆవిడ వల్ల వచ్చింది. ఆమె పేరే అరుంధతి. ఈమె ఎప్పుడూ వశిష్టుని వెంటే ఉంటుంది. సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాలలో వశిష్ట నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే, ఇది మిగతా నక్షత్రాల లాగా కాకుండా, వశిష్ట మరియు అరుంధతి నక్షత్రం కలిసి ఒకదాని వెనకాల మరొకటి తిరుగుతూ ఉంటాయి (Binary star system). సంసారంలో మొగుడు-పెళ్ళాలలో ఎవరో ఒకరు మధ్యలో ఉంది మరొకరు వారి చుట్టూరా తిరగడం కాకుండా, ఒకరి చుట్టూ మరొకరు ఉండాలి. అందుకే మన పూర్వీకులు ఆకాశంలో అన్నీ నక్షతాలు ఉంటే, వాటిలో అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్పింది. మనం దాన్ని ఆదర్శంగా తీసుకుని కలసి మెలసి ఉండాలని చెప్పారు.

ఇప్పుడు ఆకాశంలోకి చూస్తే అరుంధతి నక్షత్రం ఎక్కడుందో, ఎలా గుర్తుపట్టాలో కింద ఫోటో చూసి తెలుసుకోండి. 

P.S : మనలో మన మాట, ఈ మధ్య పెళ్లిళ్లు మిట్ట మధ్యానం పెట్టుకుని, పెళ్ళైన తర్వాత బయటకి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్తారు. ఆ ఎండకి కళ్ళు బైర్లు కమ్మి, మన పక్కనున్న వాళ్ళే కనపడరు, ఇంకా అరుంధతి నక్షత్రం ఏం కనిపిస్తుంది, మరీ విడ్డూరం కాకపోతే…………….. 

5 Sept 2013

భారతీయ కాలమానం

తృటి              = 1/3290 సెకండ్
పరమాణు        = 16.8 మైక్రో సెకండ్  
1 లిప్త             = 60 విలిప్తలు
1 విఘడియ      = 60 లిప్తలు
1 నిమిషం        = 2 ½ విఘడియలు
1 ఘడియ        = 60 విఘడియలు (24 నిమిషములు)
1 గంట            = 2 ½ ఘడియలు
1 జాము          = 3 గంటలు
1 జాము          = 7 ½ ఘడియలు
1 రోజు             = 8 జాములు
1 రోజు             = 60 ఘడియలు
1 వారము        = 7 రోజులు
1 నెల             = 4 వారాలు
1 సంవత్సరం     = 12 నెలలు
1 సంవత్సరం     = 365 రోజులు
1 భగణము       = 12 సంవత్సరాలు
5 భగణములు   = 60 సంవత్సరాలు
1 మహాయుగం   = కృతయుగం+త్రేతాయుగం+ద్వాపరయుగం+కలియుగం
1 మన్వంతరం    = 71 మహాయుగాలు
1 కల్పం                    = 14 మన్వంతరాలు
భారతీయ సిద్ధాంతాల ప్రకారం భూగోళం వయసు 8.64 బిల్లియన్ (109) సంవత్సరాలు
1 బ్రహ్మా  దేవుని పగలు    = 1000 మహాయుగములు
1 బ్రహ్మా దేవుని రాత్రి       = 1000 మహాయుగములు
1 బ్రహ్మా దేవుని దివారాత్రి = (1 పగలు+ 1 రాత్రి ) 2000 మహాయుగములు
1 బ్రహ్మా సంవత్సరం        = 360 దివారాత్రములు
బ్రహ్మా ఆయుః కాలము = 100 బ్రహ్మ సంవత్సరాలు

ఇదండీ మన భారతీయ కాలమానం. చిన్నప్పుడు కథల పుస్తకాల్లో ఘడియ, విఘడియ అని చదువుతుంటే అర్దం కాలేదు కానీ ఇప్పుడు కాస్త అర్ధమౌతుంది. 

20 Aug 2013

ఒక్క రూపాయి

ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమి వస్తుంది? రూపాయిలు తయారుచేయడానికి అయ్యే ఖర్చు రూపాయికంటే ఎక్కువ అవుతుందని, తయారుచేయడం తగ్గిపోయింది. దానితో చిల్లర దొరకక ప్రతి షాప్ లోనూ చాక్లెట్స్ ఇవ్వడం ఎక్కువైంది. అంతే కాకుండా ఇప్పుడు డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ముందు తరాల వాళ్ళు అసలు రూపాయిని చూడలేరేమో? 1, 2, 5 బదులుగా 10, 20, 50 చూస్తామేమో అనిపిస్తోంది. పాతకాలంలో అసలు రూపాయికి ఎంత చిల్లర (రూపాయికి చిల్లరా??? అని ఆశ్చర్యపోకండి :-P ) వస్తుందో కింద చూడండి.
1 రూపాయి       = 2 అర్ధరూపాయలు
                    = 4 పావలాలు
                   = 8 బేడలు
                   = 16 అణాలు
                   = 32 అర్ధ అణాలు
                   = 64 కాసులు
                   = 192 దమ్మిడీలు
                   = 384 ఠోళీలు

నాకైతే 5 పైసలు, 10 పైసలు, 20పైసలు, పావలా వరకు తెలుసు, బేడలు, అణాలు అస్సలు తెలీదు కానీ, కాణీలు (కాసులు) మాత్రం చూశాను. చిన్నప్పుడు అవి కొట్టేసే ఐసులు, పప్పుండలు కొనుక్కునే వాడిని. ఏంటి? మీరు కూడా అంతేనా? ఎంతైనా మనం మనం ఒకటి. 

15 Aug 2013

సూపర్ మాన్

ఆగండాగండి, టైటిల్ చూసి సినిమా ఊహించేసుకోకండి. స్టోరీ చదివిన తర్వాత అప్పుడు మీకే అర్దమవుతుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే నాకు ఒక సూపర్ మాన్ తెలుసు, (ఇది సినిమా కధ కాదు :-P) అతను ఎలా ఉంటాడో, ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి.
ఒకానుక రోజున ఆయన్ని కలవడానికి వెళ్ళాను, నన్ను కంప్యూటర్ కి anti-virus install చేయమన్నాడు. నేను సరే అని ******.exe తో మొదలుపెట్టాను. వెంటనే అది terms and conditions కి ఒప్పుకోకపోతే ఒప్పుకోనంది. మన అవసరం కాబట్టి ఒప్పుకోవాలి కదా!!! నేను ఒప్పుకోబోతుంటే (accept) మన సూపర్ మాన్ నన్ను ఆగమని అక్కడ ఇచ్చిన terms and conditions అన్నీ చదివి అప్పుడు ఒప్పుకున్నాడు J. ఏంటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందా???
నేను ఇలా షాక్ లు తింటూ ఉండగా ఒకరోజు పిలిచాడు. ఏంటా అని వెళితే పెన్ డ్రైవ్ లోని files అన్నీ ఒకేసారి ఎలా delete చేయాలి అని అడిగాడు. అయ్యబాబోయ్ అని ఎలాగోలా ఆయనకి అర్ధం అయ్యేలా చెప్పేలోపే ఇంకో బాంబ్ పేల్చాడు, MS Word లో undo option పని చేయట్లేదు అని. ఏంటి ఇది బాంబ్ ఏంటి అని చూస్తున్నారా? ఆగండి చెప్తా. ****.doc తెరవగానే undo hide అయ్యిఉండేంటి అని అడిగాడు. ఇంకా అర్ధం కాలేదా? అదేనండీ బాబు!!! మనం ఏదైనా edit చేస్తేనే కదా undo చేసేది, ఏమి చేయకపోతే undo చెయ్యడానికి ఏముంటుంది చెప్పండి??? ఏంటి అప్పుడే లేస్తున్నారా? అసలైన న్యూక్లియర్ బాంబ్ లాంటి సంగతి నేను చెప్తాగదా...
ఒకసారి నాకు scanner అవసరం వచ్చి, నాక్కొంచెం ఈ పేపర్ స్కాన్ చేసిపెట్టండి సార్ అన్నా. మన సూపర్ మాన్ దాన్ని colour scan కాకుండా black & White లో చేశాడు. అంటే colour scan చేస్తే scanner లో colour అయ్యిపోతుందనా???
ఇన్ని లక్షణాలు ఉంటే ఆయన్ని సూపర్ మాన్ అనకుండా ఏమంటాం? మీరే చెప్పండి.

P.S : ఈ పోస్ట్ లో కొంచెం ఆంగ్లము ఎక్కువైంది, కంప్యూటర్ కి సంబందించినది కదా. ఈ ఒక్కసారికి మన్నించేయండి. 

7 Aug 2013

బాలవినోదిని

ఈనాడు దినపత్రిక తెలిసిన వారికి సండే స్పెషల్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది “బాలవినోదిని” గురించి. గుండు మీద మూడు (333) వెంట్రుకులతో బోల్డన్ని విచిత్రమైన సంగతులు చెప్పే బాలుని ఇష్టపడని వాళ్లు ఉంటారంటే నేనైతే నమ్మను. ఒక వేళ ఎవరైనా ఉంటే వారిని @#$%&.

నాకు చిన్నప్పటి నుంచి వాటిని దాచుకోవాలని ఉండేది కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈనాడు e-paper పుణ్యమానిv ఎంచక్కా అంతర్జాలం లోనే చూసుకోవచ్చు. అంతే కాకుండా archives లో పాత సంచికలు కూడా దొరుకుతాయి. నేను వాటన్నిటిలోంచి ఆ కార్టూన్లు వెతికి, ఇంకా సమస్త అంతర్జాలమంతా శోదించి ఒక చోట పొందుపరిచాను. వాటిని మీరు ఈక్రింది లంకె లో చూడవచ్చు.


31 May 2013

శుక్రవారం


హలో!!!  ఏంటీ? టైటిల్ చూసి నేనేదో శుక్రవారం ప్రశస్తి మీద రాస్తున్నాననుకున్నారా ? కాదండీ! నేను రాసేది మా ఆఫీసు లో శుక్రవారం ఎలా ఉంటుందనేది. మాకు పనిదినాలు కేవలం ఐదు మాత్రమే, సోమవారం నుంచి శుక్రవారం వరకు. సోమవారం సంగతి ఎలా ఉన్నా, శుక్రవారం వచ్చిందంటే ఉదయం నుంచే ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనిపిస్తుంటూ ఉంటుంది. ఆఫీసు అంతా నిదానంగా కదులుతున్నట్లు ఉంటుంది (పని చేసుకునే వాళ్ళు  మాత్రం, శుక్రవారం కాదు కదా! శనివారం కూడా చేస్తూనే ఉంటారు). అదీకాకుండా మొన్నే ఇంటికి వెళ్ళేచ్చానేమో, ఇంకా flow రాలేదు. అంతలోనే శుక్రవారం వచ్చేసింది. వెళ్లిపోదామనే ఉంది కానీ, వెళ్లాలంటే short leave తీసుకుని వెళ్ళాలి. అసలే మొన్న ఇంటికి వెళ్లినప్పుడు కూడా ముందే వెళ్లిపోతుంటే Director చూసేశాడు. ఇక తప్పేదేముంది, అందుకే ఆఫీసు లోనే కూర్చుని కూడలి లో బ్లాగులు చదువుతూ కూర్చున్నాను. బోర్ కొట్టి టీ తాగడానికి వెళ్తే అక్కడ కూడా ఎవడూ లేదు, అసలే శుక్రవారం కదా. అంతే కాకుండా సోమవారం నుంచి leave తీసుకునే వాళ్ళు శుక్రవారం మధ్యాన్నం నుంచే వెళ్లిపోతారు. దాంతో ఆఫీసు అంతా dull గా ఉంటుంది. ఇదిగో నేనేమో మా హెడ్ రిపోర్ట్ రాసి ఇవ్వమంటే బ్లాగు రాస్తూ ఉన్నా:D....

మీరెవరూ చెప్పకండే!!! ఎక్కడి దొంగలు అక్కడే  గప్ చుప్ సాంబార్ బుడ్డీ!!!



25 Apr 2013

కలలు


కల అంటే నిజం కానిది అని అర్దం. కల రావాలంటే నిద్ర పోవాలంతే (పగటి కలలు వేరే లెండి). మనకేమో ఎంచక్కా పగలేమో గాల్లో తెలినట్టుందే అంటూ ఊహల్లో తేలుతూ, రాత్రేమో ఆరుబయట పండు వెన్నెల్లో చందమామని, చుక్కల్ని(ఆకాశంలో చుక్కలండి, నేనసలే చాలా మంచివాడిని ) చూస్తూ నిద్రపోతే కాలల్లోకి కూడా అవే వస్తాయి కదా!!! పగలు ఎంత హైరానా పడ్డా రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలి. అదేంటో కలలు రాకుండా నిద్ర పోతేనే మంచి నిద్ర అంటారు, నాకు మాత్రం మంచి మంచి కలలు వస్తేనే బావుంటుంది. ఎంచక్కా రెక్కల గుర్రం ఎక్కి నక్షత్రాల మధ్యలోంచి ఎగురుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది? మన కలల లోకంలో మనమే హీరో/హీరోయిన్. మనకి నచ్చినట్టు మనం చేయచ్చు, అంతా మన మనసు ఆధీనంలో ఉంటుంది. మనం ఒక కారులో వెళ్తున్నాం అనుకోండి, అది ఆగిపోవాలి అనుకుంటే ఆగిపోతుంది, వెళ్ళాలి అనుకుంటే వెళ్తుంది. మనకి కారు ఇంజిన్ సరిపోదు అనుకుంటే కారుకే విమానం ఇంజిన్ పెట్టేద్దాం. అంతా మన ఇష్టం కదా.
అంచేత ఇందుమూలముగా మీకు చెప్పొచ్చేదేమంటే మీరు కూడా మీకు ఇష్టమైన కలల లోకంలో విహరించండి.  

16 Apr 2013

నాకు ఇష్టమైన డైలాగ్

నేను మొన్న ఒక లఘుచిత్రం చూశాను. చాలా బాగుంది. అందులో ఒక డైలాగ్ బాగా నచ్చేసింది. అది మీకోసం. 


"నువ్వు నా life లో ఉండవనే నిజాన్ని తెలిసాక, నేను నీ చుట్టూ తిరగలేను. మనకి నచ్చని విషయాలు కళ్ళు మూసుకుని చూడకుండా ఉండొచ్చు, కానీ మనకి నచ్చిన feelings ఏంచేసినా వెంటాడుతూనే ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది."

లఘుచిత్రమ్ లంకె: 


24 Mar 2013

వేసవికాలం సెలవలు



అది నేను చాలా చిన్నప్పుడు. అది వేసవి కాలం. ఎంతో ఇష్టమైన కాలం. ఎంచక్కా స్కూల్ కి వెళ్ళే పని లేకుండా, ఆడుకోవచ్చు కదా. అసలే నాకు మా సోషల్ మాష్టారు అంటే అస్సలు ఇష్టం లేదు. ఏవేవో ఊరి పేర్లు ఇచ్చి ఎక్కడున్నాయో గుర్తుపెట్టమంటాడు. అది వేరే కథ. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మనం వేసవి కాలం సెలవలకు వచ్చేద్దాం. నేను, మా తమ్ముడు కలసి గేదెలను మేపడానికి మామిడి తోటలోకి తోలుకేళ్లేవాళ్ళం. ఊరికే వెళ్తామా ఏంటి? మా అమ్మని పీడించుకుని నాకు అది కావాలి, ఇది కావాలి అని పెద్ద లిస్ట్ ఇచ్చి, ఇవన్నీ ఇస్తే గాని వెళ్ళేవాళ్లం కాదు, వీటితో పాటు మంచినీళ్లు కూడా. అసలే ఎండాకాలం, మంచినీళ్లు లేకపోతే ఎలా చెప్పండి? అంతేకాకుండా మంచినీళ్లు కావాలంటే చెరువుకు వచ్చి తీసుకెళ్లాలి, అక్కడి తోటల్లో దొరకావు కూడాను. ఇంతా చేసి మేమేదో గొప్ప పని చేస్తామనుకునేరు? గేదెలకు దారి తెలుసు, వదిలేస్తే అవే మా తోటలోకి వెళ్ళేవి. మేము చేయాల్సిందల్లా అవి పక్క తోటలోకి వెళ్లకుండా కాపలా కాయలి అంతే. మేము ఎంచక్కా తోటలో కూర్చుని తెచ్చుకున్నవి తింటూ ఉండేవాళ్లం.
ఒకసారి ఏమైందంటే,
ఎవరో ఒకాయన వచ్చి “గొంతు ఎండుకుపోతుంది కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా” అన్నాడు.
మేము ఏమన్నా పిచ్చివాళ్ళమా ఇవ్వడానికి? “మేము ఇవ్వం” అని చెప్పాం.
ఆయనేమో “కొంచెం పుణ్యం ఉంటుంది, కాసిని నీళ్ళు ఇవ్వండమ్మా” అన్నాడు.
మేము మాత్రం, “మాకు పుణ్యం వద్దు, ఏమీ వద్దు, మేము ఇవ్వం” అన్నాం.
పాపం ఆయనకు బాగా దాహం వేస్తుందేమో? “చచ్చి మీ కడుపున పుడతా, కాసిని మంచినీళ్లు ఇవ్వండమ్మా” అని బతిమాలాడు.
అయినా మేము కొంచెం కూడ కరగలేదు. మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి మా దగ్గర ఉన్న నీళ్ళు అన్నీ తాగేస్తే, మళ్ళీ బొల్డు దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే “నువ్వు ఏమి మా కడుపున పుట్టక్కర్లేదు, మేము నీళ్ళు ఇవ్వం” అని చెప్పేశాం.
ఆయనేమో బొల్దంత బాధపడి, “ఏమి పిల్లలమ్మా మీరు? ప్రాణం పోతున్నా చుక్క నీళ్ళు కూడా ఇవ్వరు?” అని వెళ్లిపోయాడు.
మీరే చెప్పండి. నేను చేసింది తప్పా???
P.S: నేను చేసింది తప్పని చెప్పారో, మీకు కూడా మంచినీళ్లు ఇవ్వను. ముందే చెప్తున్నా. జాగ్రత్త!!!

23 Jan 2013

అర్దరాత్రి అంకమ్మ గోల




ప్రపంచంలోని విచిత్రమైన అయిడియాలన్నీ అర్దరాత్రే వస్తాయంటారా? నాకు అయితే అర్దరాత్రే వస్తుంటాయి. అదేంటో దయ్యాలు తిరిగే టైములో(ఇప్పుడు దయ్యాలు పగలు కూడా తిరుగుతున్నాయిలెండి  ), దయ్యాలే చెప్పినట్టుగా చిత్రవిచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. చీమలు దారి తప్పి అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా, అంతలోకి ఒక ముసలి చీమ వచ్చి “బాబూ! కళ్ళు కనపడటం లేదు, కాస్త దారి చూపిస్తావా “ అని అడిగినట్టుగా ఉంది. దోమ వచ్చి తిన్నది అరగక, (అదేలెండి! తాగింది అరగక ) నామీద వాంతి చేసుకున్నట్లుగా..... నాకు అర్దమవుతుంది మీరు మనసులో ఏమనుకుంటున్నారో. తప్పు! అలా అనుకుంటే కళ్లుపోతాయి. లెంపలేసుకోండి.

మరి మీకు అర్దరాత్రి ఎలాంటి అయిడియాలు వస్తుంటాయి???