20 Aug 2013

ఒక్క రూపాయి

ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమి వస్తుంది? రూపాయిలు తయారుచేయడానికి అయ్యే ఖర్చు రూపాయికంటే ఎక్కువ అవుతుందని, తయారుచేయడం తగ్గిపోయింది. దానితో చిల్లర దొరకక ప్రతి షాప్ లోనూ చాక్లెట్స్ ఇవ్వడం ఎక్కువైంది. అంతే కాకుండా ఇప్పుడు డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ముందు తరాల వాళ్ళు అసలు రూపాయిని చూడలేరేమో? 1, 2, 5 బదులుగా 10, 20, 50 చూస్తామేమో అనిపిస్తోంది. పాతకాలంలో అసలు రూపాయికి ఎంత చిల్లర (రూపాయికి చిల్లరా??? అని ఆశ్చర్యపోకండి :-P ) వస్తుందో కింద చూడండి.
1 రూపాయి       = 2 అర్ధరూపాయలు
                    = 4 పావలాలు
                   = 8 బేడలు
                   = 16 అణాలు
                   = 32 అర్ధ అణాలు
                   = 64 కాసులు
                   = 192 దమ్మిడీలు
                   = 384 ఠోళీలు

నాకైతే 5 పైసలు, 10 పైసలు, 20పైసలు, పావలా వరకు తెలుసు, బేడలు, అణాలు అస్సలు తెలీదు కానీ, కాణీలు (కాసులు) మాత్రం చూశాను. చిన్నప్పుడు అవి కొట్టేసే ఐసులు, పప్పుండలు కొనుక్కునే వాడిని. ఏంటి? మీరు కూడా అంతేనా? ఎంతైనా మనం మనం ఒకటి. 

15 Aug 2013

సూపర్ మాన్

ఆగండాగండి, టైటిల్ చూసి సినిమా ఊహించేసుకోకండి. స్టోరీ చదివిన తర్వాత అప్పుడు మీకే అర్దమవుతుంది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే నాకు ఒక సూపర్ మాన్ తెలుసు, (ఇది సినిమా కధ కాదు :-P) అతను ఎలా ఉంటాడో, ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి.
ఒకానుక రోజున ఆయన్ని కలవడానికి వెళ్ళాను, నన్ను కంప్యూటర్ కి anti-virus install చేయమన్నాడు. నేను సరే అని ******.exe తో మొదలుపెట్టాను. వెంటనే అది terms and conditions కి ఒప్పుకోకపోతే ఒప్పుకోనంది. మన అవసరం కాబట్టి ఒప్పుకోవాలి కదా!!! నేను ఒప్పుకోబోతుంటే (accept) మన సూపర్ మాన్ నన్ను ఆగమని అక్కడ ఇచ్చిన terms and conditions అన్నీ చదివి అప్పుడు ఒప్పుకున్నాడు J. ఏంటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందా???
నేను ఇలా షాక్ లు తింటూ ఉండగా ఒకరోజు పిలిచాడు. ఏంటా అని వెళితే పెన్ డ్రైవ్ లోని files అన్నీ ఒకేసారి ఎలా delete చేయాలి అని అడిగాడు. అయ్యబాబోయ్ అని ఎలాగోలా ఆయనకి అర్ధం అయ్యేలా చెప్పేలోపే ఇంకో బాంబ్ పేల్చాడు, MS Word లో undo option పని చేయట్లేదు అని. ఏంటి ఇది బాంబ్ ఏంటి అని చూస్తున్నారా? ఆగండి చెప్తా. ****.doc తెరవగానే undo hide అయ్యిఉండేంటి అని అడిగాడు. ఇంకా అర్ధం కాలేదా? అదేనండీ బాబు!!! మనం ఏదైనా edit చేస్తేనే కదా undo చేసేది, ఏమి చేయకపోతే undo చెయ్యడానికి ఏముంటుంది చెప్పండి??? ఏంటి అప్పుడే లేస్తున్నారా? అసలైన న్యూక్లియర్ బాంబ్ లాంటి సంగతి నేను చెప్తాగదా...
ఒకసారి నాకు scanner అవసరం వచ్చి, నాక్కొంచెం ఈ పేపర్ స్కాన్ చేసిపెట్టండి సార్ అన్నా. మన సూపర్ మాన్ దాన్ని colour scan కాకుండా black & White లో చేశాడు. అంటే colour scan చేస్తే scanner లో colour అయ్యిపోతుందనా???
ఇన్ని లక్షణాలు ఉంటే ఆయన్ని సూపర్ మాన్ అనకుండా ఏమంటాం? మీరే చెప్పండి.

P.S : ఈ పోస్ట్ లో కొంచెం ఆంగ్లము ఎక్కువైంది, కంప్యూటర్ కి సంబందించినది కదా. ఈ ఒక్కసారికి మన్నించేయండి. 

7 Aug 2013

బాలవినోదిని

ఈనాడు దినపత్రిక తెలిసిన వారికి సండే స్పెషల్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది “బాలవినోదిని” గురించి. గుండు మీద మూడు (333) వెంట్రుకులతో బోల్డన్ని విచిత్రమైన సంగతులు చెప్పే బాలుని ఇష్టపడని వాళ్లు ఉంటారంటే నేనైతే నమ్మను. ఒక వేళ ఎవరైనా ఉంటే వారిని @#$%&.

నాకు చిన్నప్పటి నుంచి వాటిని దాచుకోవాలని ఉండేది కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈనాడు e-paper పుణ్యమానిv ఎంచక్కా అంతర్జాలం లోనే చూసుకోవచ్చు. అంతే కాకుండా archives లో పాత సంచికలు కూడా దొరుకుతాయి. నేను వాటన్నిటిలోంచి ఆ కార్టూన్లు వెతికి, ఇంకా సమస్త అంతర్జాలమంతా శోదించి ఒక చోట పొందుపరిచాను. వాటిని మీరు ఈక్రింది లంకె లో చూడవచ్చు.