31 May 2013

శుక్రవారం


హలో!!!  ఏంటీ? టైటిల్ చూసి నేనేదో శుక్రవారం ప్రశస్తి మీద రాస్తున్నాననుకున్నారా ? కాదండీ! నేను రాసేది మా ఆఫీసు లో శుక్రవారం ఎలా ఉంటుందనేది. మాకు పనిదినాలు కేవలం ఐదు మాత్రమే, సోమవారం నుంచి శుక్రవారం వరకు. సోమవారం సంగతి ఎలా ఉన్నా, శుక్రవారం వచ్చిందంటే ఉదయం నుంచే ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనిపిస్తుంటూ ఉంటుంది. ఆఫీసు అంతా నిదానంగా కదులుతున్నట్లు ఉంటుంది (పని చేసుకునే వాళ్ళు  మాత్రం, శుక్రవారం కాదు కదా! శనివారం కూడా చేస్తూనే ఉంటారు). అదీకాకుండా మొన్నే ఇంటికి వెళ్ళేచ్చానేమో, ఇంకా flow రాలేదు. అంతలోనే శుక్రవారం వచ్చేసింది. వెళ్లిపోదామనే ఉంది కానీ, వెళ్లాలంటే short leave తీసుకుని వెళ్ళాలి. అసలే మొన్న ఇంటికి వెళ్లినప్పుడు కూడా ముందే వెళ్లిపోతుంటే Director చూసేశాడు. ఇక తప్పేదేముంది, అందుకే ఆఫీసు లోనే కూర్చుని కూడలి లో బ్లాగులు చదువుతూ కూర్చున్నాను. బోర్ కొట్టి టీ తాగడానికి వెళ్తే అక్కడ కూడా ఎవడూ లేదు, అసలే శుక్రవారం కదా. అంతే కాకుండా సోమవారం నుంచి leave తీసుకునే వాళ్ళు శుక్రవారం మధ్యాన్నం నుంచే వెళ్లిపోతారు. దాంతో ఆఫీసు అంతా dull గా ఉంటుంది. ఇదిగో నేనేమో మా హెడ్ రిపోర్ట్ రాసి ఇవ్వమంటే బ్లాగు రాస్తూ ఉన్నా:D....

మీరెవరూ చెప్పకండే!!! ఎక్కడి దొంగలు అక్కడే  గప్ చుప్ సాంబార్ బుడ్డీ!!!



25 Apr 2013

కలలు


కల అంటే నిజం కానిది అని అర్దం. కల రావాలంటే నిద్ర పోవాలంతే (పగటి కలలు వేరే లెండి). మనకేమో ఎంచక్కా పగలేమో గాల్లో తెలినట్టుందే అంటూ ఊహల్లో తేలుతూ, రాత్రేమో ఆరుబయట పండు వెన్నెల్లో చందమామని, చుక్కల్ని(ఆకాశంలో చుక్కలండి, నేనసలే చాలా మంచివాడిని ) చూస్తూ నిద్రపోతే కాలల్లోకి కూడా అవే వస్తాయి కదా!!! పగలు ఎంత హైరానా పడ్డా రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోవాలి. అదేంటో కలలు రాకుండా నిద్ర పోతేనే మంచి నిద్ర అంటారు, నాకు మాత్రం మంచి మంచి కలలు వస్తేనే బావుంటుంది. ఎంచక్కా రెక్కల గుర్రం ఎక్కి నక్షత్రాల మధ్యలోంచి ఎగురుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది? మన కలల లోకంలో మనమే హీరో/హీరోయిన్. మనకి నచ్చినట్టు మనం చేయచ్చు, అంతా మన మనసు ఆధీనంలో ఉంటుంది. మనం ఒక కారులో వెళ్తున్నాం అనుకోండి, అది ఆగిపోవాలి అనుకుంటే ఆగిపోతుంది, వెళ్ళాలి అనుకుంటే వెళ్తుంది. మనకి కారు ఇంజిన్ సరిపోదు అనుకుంటే కారుకే విమానం ఇంజిన్ పెట్టేద్దాం. అంతా మన ఇష్టం కదా.
అంచేత ఇందుమూలముగా మీకు చెప్పొచ్చేదేమంటే మీరు కూడా మీకు ఇష్టమైన కలల లోకంలో విహరించండి.  

16 Apr 2013

నాకు ఇష్టమైన డైలాగ్

నేను మొన్న ఒక లఘుచిత్రం చూశాను. చాలా బాగుంది. అందులో ఒక డైలాగ్ బాగా నచ్చేసింది. అది మీకోసం. 


"నువ్వు నా life లో ఉండవనే నిజాన్ని తెలిసాక, నేను నీ చుట్టూ తిరగలేను. మనకి నచ్చని విషయాలు కళ్ళు మూసుకుని చూడకుండా ఉండొచ్చు, కానీ మనకి నచ్చిన feelings ఏంచేసినా వెంటాడుతూనే ఉంటాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది."

లఘుచిత్రమ్ లంకె: