24 Sept 2013

మీరు అరుంధతి నక్షత్రాన్ని చూసారా?

పెళ్ళైన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మీరు అరుంధతి నక్షత్రాన్ని చూసారా? పెళ్లికానోళ్ళు కూడా తెలుసుకోండి. పెళ్లిళ్లలో పంతులు గారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురులకి అరుంధతి నక్షత్రాన్ని చూడామణి చెప్తారు, ఆయనకి ఎలాగూ కనపడదనుకోండి. కొత్త దంపతులేమో ఎక్కడా ఎక్కడా అని వెతికేసి (ఆకాశంలోనండి బాబూ!!!), మెడలు నొప్పి పుట్టి, కనపడింది అని అబద్దం చెప్పేస్తారు. చూసారా... పెళ్ళైన వెంటనే అబద్దాలు మొదలెట్టేస్తారు!!!! :-P.
అసలు ఆ అరుంధతి నక్షత్రం, దాని కధాకమానిషా ఇప్పుడు చెప్తా, మీరు బుద్ధిగా వినేయండి. అనగనగా ఏడుగురు ఋషులు ఉండేవారు. వాళ్ళు వశిష్ట, భరద్వాజ, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, అత్రి, అగస్య, వీళ్ళ పేరు మీద ఏడు నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి సప్తర్షి మండలం అంటారు. వీళ్ళందరిలో వశిష్టునికి ఒక ప్రత్యేకత ఉంది. అది వాళ్ళ ఆవిడ వల్ల వచ్చింది. ఆమె పేరే అరుంధతి. ఈమె ఎప్పుడూ వశిష్టుని వెంటే ఉంటుంది. సప్తర్షి మండలంలోని ఏడు నక్షత్రాలలో వశిష్ట నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే, ఇది మిగతా నక్షత్రాల లాగా కాకుండా, వశిష్ట మరియు అరుంధతి నక్షత్రం కలిసి ఒకదాని వెనకాల మరొకటి తిరుగుతూ ఉంటాయి (Binary star system). సంసారంలో మొగుడు-పెళ్ళాలలో ఎవరో ఒకరు మధ్యలో ఉంది మరొకరు వారి చుట్టూరా తిరగడం కాకుండా, ఒకరి చుట్టూ మరొకరు ఉండాలి. అందుకే మన పూర్వీకులు ఆకాశంలో అన్నీ నక్షతాలు ఉంటే, వాటిలో అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్పింది. మనం దాన్ని ఆదర్శంగా తీసుకుని కలసి మెలసి ఉండాలని చెప్పారు.

ఇప్పుడు ఆకాశంలోకి చూస్తే అరుంధతి నక్షత్రం ఎక్కడుందో, ఎలా గుర్తుపట్టాలో కింద ఫోటో చూసి తెలుసుకోండి. 

P.S : మనలో మన మాట, ఈ మధ్య పెళ్లిళ్లు మిట్ట మధ్యానం పెట్టుకుని, పెళ్ళైన తర్వాత బయటకి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెప్తారు. ఆ ఎండకి కళ్ళు బైర్లు కమ్మి, మన పక్కనున్న వాళ్ళే కనపడరు, ఇంకా అరుంధతి నక్షత్రం ఏం కనిపిస్తుంది, మరీ విడ్డూరం కాకపోతే…………….. 

No comments:

Post a Comment